విజయవాడలోని వరద బాధితుల సహాయార్థం పులివెందుల వైసీపీ నాయకులు సేకరించిన నిత్యావసర సరుకులను శనివారం సాయంత్రం పంపిణీ చేశారు. మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర నూర్ బాషా సంఘం అధ్యక్షులు, ఓతూరు రసూల్ విజయవాడలోని పాయకపురం, జక్కంపూడి ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో వరద బాధితులకు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నూర్ బాషా సంఘ సభ్యులు, వైసీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.