పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి

80చూసినవారు
పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి
పర్యావరణ సమతుల్యత, పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని వేంపల్లె అటవీశాఖ రేంజ్ అధికారి పి. బాలసుబ్రమణ్యం పిలుపునిచ్చారు. బుధవారం వేంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో అమ్మ పేరిట ఒక చెట్టు కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భూమిపై మానవాళి మనుగడకు ప్రకృతి సమతుల్యత ఎంతో అవసరమన్నారు. అందువల్ల అడవులు, చెట్లు నరికివేత మానుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్