ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్, ఉండి నియోజకవర్గం శాసనసభ్యుడు రఘురామకృష్ణం రాజు ను పులివెందుల టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం విజయవాడలో జన్మదినం జరుపుకుంటున్న రఘురామకృష్ణ రాజును బీటెక్ రవి కలిశారు. నిండు నూరేళ్లు సంపూర్ణ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని బిటెక్ రవి కోరారు.