పులివెందుల మండలం వై కొత్తపల్లెలో ఆకస్మికంగా వచ్చిన గాలి వాన వల్ల నష్టపోయిన అరటి రైతులను ఆదుకోవాలని బిజెపి నాయకుడు కేతిరెడ్డి తిరుపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం నేలకూలిన అరటి తోటలను సందర్శించి రైతుల సమస్యలను తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ అరటి తోటలు నష్టపోయిన ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో కూడా గాలి వానకు నష్టపోయిన అరటి రైతులకు ఇప్పటివరకు పరిహారం రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.