పులివెందుల: అగ్ని ప్రమాదాల నివారణకు కరపత్రాల పంపిణీ

65చూసినవారు
పులివెందుల: అగ్ని ప్రమాదాల నివారణకు కరపత్రాల పంపిణీ
అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా పులివెందుల పూలంగళ్ల సర్కిల్, మెయిన్ బజార్, తదితర ప్రాంతాలలో మంగళవారం అగ్నిమాపక శాఖ అధికారి సునీల్ కుమార్ అగ్ని ప్రమాదాల నివారణపై కరపత్రాలను పంపిణీ చేశారు. ప్రజలకు అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. అనంతరం వారు నీటి విన్యాసాల ద్వారా డెమో చేసి చూపించారు. కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్