పులివెందులలోని స్థానిక శ్రీకృష్ణ ఆలయంలో వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని శుక్రవారం ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి కుటుంబ సమేతంగా సందర్శించారు. ఈ సందర్భంగా స్వామివారి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు పోటెత్తడంతో క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి.