వైసీపీ రాష్ట్ర వైద్య విభాగ ప్రధాన కార్యదర్శి వైఎస్ అభిషేక్ రెడ్డి మృతదేహానికి శనివారం ఉదయం కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్ అభిషేక్ రెడ్డి కుటుంబ సభ్యులు వైఎస్ మధురెడ్డి, వైఎస్ ప్రకాశ్ రెడ్డిలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయన వెంట వైసీపీ కార్యకర్తలు ఉన్నారు.