పులివెందుల పట్టణంలో సుందరీకరణలో భాగంగా గత ప్రభుత్వం వందల కోట్లతో అభివృద్ధి పనులను చేపట్టింది. అందులో భాగంగా పట్టణంలోని చందమామ డాబా వద్ద ఉన్న రింగురోడ్డులో చేపట్టిన పనులకు ప్యాచెస్ వేయించారు. ఏడాది గడవక ముందే రోడ్డు గుంతలు ఏర్పడి అప్పుడే ప్యాచులు పడ్డాయని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రోడ్డు ప్యాచ్ లు పడకుండా చూడాలన్నారు.