పులివెందుల: సీనియర్ జర్నలిస్టు అరెస్టుకు నిరసనగా ర్యాలీ

78చూసినవారు
పులివెందుల: సీనియర్ జర్నలిస్టు అరెస్టుకు నిరసనగా ర్యాలీ
సీనియర్ పాత్రికేయులు కొమ్మినేని శ్రీనివాసరావును విజయవాడ పోలీసులు అక్రమంగా అరెస్టు చెయ్యడం జరిగిందని, దీనికి నిరసనగా మంగళవారం పులివెందుల జర్నలిస్టులు ర్యాలీ నిర్వహించారు. పులివెందుల పట్టణంలోని పాత బస్టాండ్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం పోలీసులకు వినతి పత్రం అందజేశారు. మీడియా స్వేచ్ఛను కాపాడాలని పులివెందుల జర్నలిస్టులు కోరారు.

సంబంధిత పోస్ట్