పులివెందుల: అగ్నిప్రమాదాలపట్ల విద్యార్థులు అవగాహన

50చూసినవారు
పులివెందుల: అగ్నిప్రమాదాలపట్ల విద్యార్థులు అవగాహన
పులివెందుల పట్టణంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో విద్యార్థులకు అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా గురువారం అగ్నిమాపక శాఖ అధికారి సునీల్ కుమార్ అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు భయపడకుండా అగ్నిమాపక శాఖ సిబ్బందికి తెలియజేయాలన్నారు. అగ్ని ప్రమాదాలపట్ల విద్యార్థులు జాగ్రత్తలు వహించాలన్నారు. కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్