పులివెందుల రింగ్ రోడ్డులో టీడీపీ మహానాడు కోసం ఏర్పాటు చేసిన పార్టీ జెండాలను కొందరు గుర్తు తెలియని యువకులు పీకేసి కాల్చేశారు. ఈ విషయాన్ని స్థానిక టీడీపీ నాయకులు గురువారం సాయంత్రం పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఘటనపై స్పందించిన పోలీసులు యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.