కడప జిల్లా పులివెందుల మారుతీ హాల్ వద్ద ఓ చిన్నారి తిరుగుతూ కనిపించడంతో స్థానికులు అతన్ని పోలీసులకు అప్పగించారు. తన పేరు, చిరునామా చెప్పలేని స్థితిలో ఉండటంతో బుధవారం ఉదయం స్టేషన్‌కి తీసుకెళ్లారు. పోలీసుల సమాచారం ద్వారా విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు అక్కడికి చేరుకుని తన కుమారుడిని సురక్షితంగా ఇంటికి తీసుకెళ్లారు.