వైసీపీ యువ నాయకుడు వైయస్ అభిషేక్ రెడ్డి మృతి బాధాకరమని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవీంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం స్థానిక వైఎస్ మధురెడ్డి నివాసంలో టీడీపీ నాయకుడు బీటెక్ రవి వైఎస్ అభిషేక్ రెడ్డి మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. వైఎస్ ప్రకాశ్ రెడ్డి కుటుంబానికి, తమకు మంచి సంబంధాలు ఉన్నాయన్నారు. మా రాజకీయ ఎదుగుదలకు పాలిరెడ్డి పాత్ర ఎంతో ఉందన్నారు.