పులివెందుల పట్టణంలోని గరండాల్ బ్రిడ్జి నుంచి ఎర్రగుడిపల్లి రహదారిలో ఏర్పడిన గుంతను పూడ్చాలని స్థానిక ప్రజలు కోరారు. గతపది రోజుల క్రితం కురిసిన వర్షానికి రోడ్డంతా కోసుకుపోయింది. అంతేకాక రోడ్డు చివరలో పెద్ద గుంత ఏర్పడడంతో ఏ మాత్రం ఆదమరిచినా ప్రమాదంతప్పదని వాహనదారులు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రోడ్డు మధ్యలోఏర్పడిన గుంతను పూడ్చి రోడ్డును బాగుచేయాలని ప్రయాణికులు కోరారు.