పులివెందుల చెన్నారెడ్డి కాలనీలో విశ్వనాథరెడ్డి అనే ఉపాధ్యాయుడి నివాసంలో చోరీ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు బుధవారం సిఐ జీవన్ గంగనాథ్ బాబు తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఆయన మాట్లాడుతూ ముద్దనూరు రోడ్డులో అనుమానాస్పదంగా సంచరిస్తున్న లింగుటేరీ రాంబాబు, నడింపల్లి గోపి, సోను కుమారాయ్ని అదుపులోకి తీసుకొని 105 గ్రాముల బంగారు, 116 గ్రాముల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నామన్నారు.