గృహాల ముందున్న ట్రాన్స్ఫార్మర్ ను తొలగించండి

77చూసినవారు
గృహాల ముందున్న ట్రాన్స్ఫార్మర్ ను తొలగించండి
పులివెందుల పరిధిలోని వెంకటాపురం లో ఎస్సీ కాలనీ వద్ద ఇండ్ల ముందర ట్రాన్స్ఫార్మర్ ఉందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షం వస్తే ప్రమాదాలు ఎక్కువ జరిగే అవకాశం ఉందని వారు వాపోతున్నారు. గతంలో వర్షం వచ్చినప్పుడు ట్రాన్స్ఫార్మర్ తీగలు కింద పడ్డాయని అప్పుడు భయాందోళనలకు గురయ్యామని పేర్కొంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ట్రాన్స్ఫార్మర్ను మరొక చోట ఉంచాలని కాలనీవాసులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్