చదువుతోపాటు క్రీడల్లో విద్యార్థులు రాణించాలని టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి అన్నారు. శుక్రవారం వేంపల్లెలోని బాలుర పాఠశాల ఆట స్థలంలో 38వ రాష్ట్ర హ్యాండ్ బాల్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీలనుబీటెక్ రవి ప్రారభించారు. క్రీడల్లో కూడా మంచిగుర్తింపు వస్తుందని చెప్పారు. తల్లిదండ్రులు క్రీడల వైపు విద్యార్ధులను ప్రోత్సాహించాలని కోరారు. టీడీపీ నేతలు పాల్గొన్నారు.