వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల క్యాంపు కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన వైఎస్ జగన్ ప్రజాదర్బార్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రజాదర్బార్ సందర్భంగా జగన్‌ను చూసేందుకు ప్రజలు, వైసీపీ కార్యకర్తలు ఒక్కసారిగా ఎగబడ్డారు. దీంతో కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో కార్యాలయం అద్దాలు ధ్వంసమయ్యాయి. పోలీసులు కార్యకర్తలను కంట్రోల్ చేయలేక.. వారిని చెదరగొట్టారు.