రేపు లింగాల మండల సర్వసభ్య సమావేశం

78చూసినవారు
రేపు లింగాల మండల సర్వసభ్య సమావేశం
లింగాలలోని ఎంపీడీవో కార్యాలయ సభా భవనంలో శుక్రవారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో తేజోత్స్న తెలిపారు. ఎంపీపీ రమాదేవి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో తాగునీరు, విద్య, వైద్యం, ఉపాధి హామీ, నీటిపారుదల, వ్యవసాయం తదితర అంశాలపై చర్చ జరుగుతుందని తెలిపారు. కావున మండల స్థాయి అధికారులు తగిన నివేదికలతో హాజరు కావాలన్నారు. ఎంపీటీసీలు, సర్పంచులు, జడ్పీటీసీలు ఈ సమావేశానికి హాజరు కావాలని కోరారు.

సంబంధిత పోస్ట్