తొండూరులోని హరిజనవాడలో కాలువలు లేకపోవడంతో మురుగునీరు రహదారిపై పారుతోంది. దుర్వాసనతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. మురుగునీరు నిల్వ ఉండడంతో దోమల బెడద ఎక్కువగా ఉందని సోమవారం స్థానిక ప్రజలు వాపోతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి సమస్య పరిష్కారానికి చొరవ చూపి మురుగు కాలువలు నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.