మన్నూరు మండలంలోని బలిజవీధిలో గురువారం జరిగిన ఘర్షణలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల మేరకు నారదాసు కిట్టయ్య చిన్న పిల్లలను మందలించాడని సాదు సుధ భార్య సువర్ణ కుటుంబ సభ్యులు ఆగ్రహంతో నారదాసు కిట్టయ్య, భార్య సునిత పై రాడ్లు, రాళ్ళు కర్రలతో దాడి చేశారు. గాయపడిన వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. మన్నూరు సీఐ రామాంజనేయులు కు వివరణ కోరగా ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.