మోదీ విశాఖ పర్యటన సందర్భంగా ఢిల్లీ ఎన్నికలలో గెలిచేది బీజేపీనే అని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఆప్ జిల్లా కో ఆర్డినేటర్ రహంతుల్లా పేర్కొన్నారు. గురువారం సాయంత్రం ఆయన వేంపల్లెలో మాట్లాడుతూ అమలు చేయాల్సిన సూపర్ 6 హామీలు మరచి, ఢిల్లీలో ఎవరు అధికారంలోకి వస్తారో చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అరవింద్ కేజ్రివాల్ గెలుపును ఎవరూ ఆపలేరని అన్నారు.