ఆపరేషన్ సిందూర్ విజయవంతం అయ్యేటందుకు మోడీ నాయకత్వ పటిమ అని చెప్పేందుకు తిరంగా యాత్రను మే 13నుండి 23 వరకు నిర్వహించాలని బీజేపీ నిర్ణయించడం హాస్యాస్పదంఅని సీనియర్ కాంగ్రెస్ నేత తులసి రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన వేంపల్లి లో మాట్లాడుతూ, తిరంగా యాత్రకు ముందు బిజెపి నాయకులు దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. కేంద్ర భద్రతా సిబ్బంది వుండి వుంటే ఉగ్ర వాదులు అమాయక పర్యాటకులపై దాడి చేసేవారు కాదన్నారు.