యాంకర్, జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్టు చేయడం సమంజసం కాంగ్రెస్ సీనియర్ నేత తులసి రెడ్డి తెలిపారు. మంగళవారం వేంపల్లిలో ఆయన మాట్లాడారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన కృష్ణంరాజుపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. అనుచిత వ్యాఖ్యలు టీవీ ఛానల్లో ప్రసారమయ్యాయి కాబట్టి ఆ యాజమాన్యం అమరావతి మహిళలకు క్షమాపణ చెప్పాలని అన్నారు. అలాగే ఆ యాజమాన్యానికి చెందిన ఫర్నీచర్ ను ధ్వంసం చేయడం తప్పని పేర్కొన్నారు.