వేంపల్లి పట్టణంలోని శ్రీరాం నగర్, గరుగువీధి తదితర ప్రాంతాల్లో మురికి కాలువలు శుభ్రం చేయకపోవడంతో దుర్వాసన వస్తుందని 3వ వార్డు సభ్యులు కంతూరి వెంకటేష్ పేర్కొన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ. పంచాయతీ సిబ్బంది తక్షణమే స్పందించి కాలువలు శుభ్రం చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆరోగ్యం తో అధికారులు చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు.