రాష్ట్రంలో మద్యం పాలసీ గాడి తప్పిందని కాంగ్రెస్ పార్టీ నాయకులు తులసి రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం వేంపల్లిలో ఆయన మాట్లాడుతూ మండలానికి 4 మద్యం షాపులు, 40 బెల్ట్ షాపులు అన్న విధంగా తయారయిందన్నారు. సాక్షాత్తూ హోమ్ మినిస్టర్ నియోజకవర్గమైన పాయకరావుపేట, సూదిపురం గ్రామంలో బెల్ట్ షాపుకు దండోరా వేశారని, వేలం పాట ద్వారా రమణ బాబు అనే వ్యక్తి రూ. 2.01 లక్షలకు దక్కించుకున్నట్లు వార్తలు వచ్చాయని తెలిపారు.