రక్త దాతలు నిజమైన ప్రాణదాతలని కాంగ్రెస్ సీనియర్ నేత తులసి రెడ్డి అన్నారు. ప్రపంచ రక్త దాన దినోత్సవం సందర్భంగా శనివారం వేంపల్లిలో ఆయన మాట్లాడారు. రక్త దాతలు సృష్ఠి కర్తతో సమానమన్నారు. 18- 60 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ తమ రక్తాన్ని మూడు నెలలకోకసారి దానం చేయవచ్చన్నారు. రక్త దానం చేయడం వల్ల రక్త గ్రహీత ప్రాణం కాపాడబడుతుందన్నారు.