వేంపల్లి: ట్రిపుల్ ఐటీలకు 30, 500 దరఖాస్తులు

67చూసినవారు
వేంపల్లి: ట్రిపుల్ ఐటీలకు 30, 500 దరఖాస్తులు
ఆర్జీయూకేటీ పరిధిలోని నూజివీడు,ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లో చేరేందుకు విద్యార్థుల నుంచి మంగళవారం వరకు 30, 500 దరఖాస్తులు వచ్చాయి. స్వీకరణ గడువు ఈనెల 20తో ముగియనుంది. ట్రిపుల్ ఐటీలో ఉన్న ఆరేళ్ల సమీకృత ఇంజనీరింగ్ కోర్సులో చేరేందుకు గతనెల 27 నుంచి ఆర్జీయూకేటీ ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరిస్తోంది. కాగా, జూన్ 5న ఎంపికైన అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు.

సంబంధిత పోస్ట్