వేంపల్లి గ్రామ పంచాయతీలలో పైసల్ లేని కారణంగా పారిశుధ్యం పడకేసిందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి తులసి రెడ్డి అన్నారు. ఆదివారం వేంపల్లిలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయలేదు. వేంపల్లి గ్రామ పంచాయతీలో 6 నెలలుగా సిబ్బందికి జీతాలు లేవు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులను పంచాయితీలకు విడుదల చేయాలని తులసి రెడ్డి డిమాండ్ చేశారు.