వేముల మండలంలో రైతులు వేసవికాలంలో పత్తి సాగు చేశారు. మంచి దిగుబడుల కోసం ఆశపడితే, అనుకోని తెగుళ్లు పంటను దెబ్బతీశాయి. పత్తి కాయలు ఎండిపోవడంతో నాణ్యత తగ్గింది. దీంతో ఆశించిన ఆదాయం రాకపోవచ్చని రైతులు ఆందోళన చెందుతున్నారు. తీవ్ర నష్టాలు ఎదురవుతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.