చక్రాయపేట జిల్లా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. నేరుసుపల్లె గ్రామ పంచాయతీలోని పలు గ్రామాల్లో త్రాగునీటి సమస్యలు ఉన్నాయని పాపాగ్ని నదిలో విద్యుత్ మోటార్లు కాలిపోవడం పట్టించుకోకపోవడం వల్ల త్రాగునీటి కొరత తలెత్తిందని సర్పంచులు ఎమ్మెల్సీ దృష్టికి తీసుకువెళ్లారు. గ్రామానికి త్రాగునీటి సమస్య లేకుండా చూడాలని అధికారులకు సూచించారు.