పెంచికల బసిరెడ్డి జలాశయం(పీబీఆర్) నుంచి ఈ నెల 21న కుడికాలువకు సాగునీటిని విడుదల చేస్తామని పీబీసీ ఈఈ రాజశేఖర్ తెలిపారు. హెడ్ రెగ్యులేటర్ గేట్లు మరమ్మతులు చేపట్టామన్నారు. గండికోట-పీబీఆర్ గొడ్డుమర్రి ఎత్తిపోతల పథకం-4 నుంచి ఈ నెల 18న నేరుగా పులివెందుల బ్రాంచి కాలువ (పీబీసీ) ఆయకట్టుకు నీరు విడుదల చేస్తామని ఆయన తెలిపారు.