Mar 24, 2025, 10:03 IST/
సగటున ప్రతి నెలా 250 అత్యాచార కేసులు: హరీశ్ రావు
Mar 24, 2025, 10:03 IST
TG: గతేడాదితో పోలిస్తే, ఈ ఏడాదిలో అత్యాచారం కేసులు 29% పెరుగుదలతో 2945 కేసులు నమోదైనట్లు డీజీపీ ప్రకటించారని BRS నేత హరీశ్ రావు పేర్కొన్నారు. సగటున ప్రతి నెలా 250 అత్యాచార కేసులు నమోదవుతున్న దారుణమైన పరిస్థితి ఉందని చెప్పారు. 'మహిళలు అత్యాచారాలు, హత్య, వేధింపులకు గురవుతుంటే ప్రభుత్వం చేతులు ముడుచుకు చూస్తుంది. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేస్తామని ప్రగల్బాలు పలకడం కాదు, మహిళల ప్రాణాలకు భద్రత కల్పించండి' అని ఫైర్ అయ్యారు.