ఓబులవారి పల్లి మండలం మాజీ ఎంపిపి తిరుపాలు ఆధ్వర్యంలో బెస్తపల్లి గ్రామానికి చెందిన 60 బెస్త కుటుంబాలు శనివారం సాయంత్రం జనసేన పార్టీ, టీడీపీ పార్టీలో చేరారు. టిడిపి నియోజకవర్గ బాధ్యులు ముక్కా రూపానందరెడ్డి భార్య వరలక్ష్మి పార్టీలో చేరిన వారికి కండువా కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో వేరేసి వెంకటయ్య, బొక్కసం సురేష్, రంగు వెంకటరమణ, సారా సుబ్రహ్మణ్యం, పిడుగు సుబ్బరాయుడు పాల్గొన్నారు.