ట్రాన్స్ఫార్మర్ కొరకు దిమ్మె కట్టారు, నీరు పోయడం మరిచారు

74చూసినవారు
ట్రాన్స్ఫార్మర్ కొరకు దిమ్మె కట్టారు, నీరు పోయడం మరిచారు
ఓబులవారిపల్లె మండలం రెడ్డిపల్లి, కొర్లకుంట గ్రామాలలో ట్రాన్స్ఫార్మర్ బిగించేందుకు సిమెంట్ ఇటుకలతో దిమ్మె ఏర్పాటు చేశారు. దిమ్మె నిర్మాణాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడంతో వారు దిమ్మె గట్టిపడేందుకు అవసరమైన నీరు పోయకుండా వదిలేశారు. ఓబులవారిపల్లి విద్యుత్ శాఖ ఏఈ కిరణ్ ని వివరణ కోరగా దిమ్మె గట్టిపడేందుకు నీరు పోయకుండా వదిలేసిన కాంట్రాక్టర్ ను విచారించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

సంబంధిత పోస్ట్