ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమని రైల్వేకోడూరు శాసనసభ్యులు శ్రీధర్, టిడిపి నియోజకవర్గ బాధ్యులు రూపానంద రెడ్డి అన్నారు. గురువారం గుండెపోటుకు సంబంధించిన విలువైన ఇంజక్షన్ ను రైల్వే కోడూరు సార్వజనిక ఆసుపత్రిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రజల అవసరాలు తీర్చడంలో, విలువైన వైద్య సేవలు అందించడంలో కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని వారు తెలిపారు.