ఆగస్టు 8వ తేదీ ఉదయం 10 గంటలకు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు చిట్వేలి మండల విద్యాశాఖ అధికారి కోదండ నాయుడు తెలిపారు. గురువారం చిట్వేలి ఎంఈఓ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఆగస్టు 5వ తేదీన తుది ఓటర్ల లిస్టు ప్రకటిస్తామని తెలిపారు. 8వ తేదీ ఉదయం 7 గంటల నుండి 1 గంట వరకు ఎన్నికలు నిర్వహించి, అదే రోజు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరుగుతుందని తెలిపారు.