పీర్ల పండుగ సందర్భంగా ఎద్దుల బండలాగుడు పోటీలు

11చూసినవారు
పీర్ల పండుగ సందర్భంగా ఎద్దుల బండలాగుడు పోటీలు
పీర్ల పండుగను హిందూ ముస్లింలు కలిసి నిర్వహించుకోవడం సంతోషించదగ్గ విషయమని రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్, నియోజకవర్గం టిడిపి బాధ్యులు రూపానంద రెడ్డి అన్నారు. పెనగలూరు మండలం నల్లపురెడ్డిపల్లి గ్రామంలో పీర్ల పండుగ సందర్భంగా శనివారం ఎద్దుల బండలాగుడు పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన గ్రామీణ జీవనశైలికి ప్రతిబింబంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం సంతోషమన్నారు.

సంబంధిత పోస్ట్