రైల్వే కోడూరు నియోజకవర్గం చిట్వేలిలోని సత్యమ్మ తల్లి జాతర వైభవంగా ఆదివారం ఉదయం ప్రారంభమైంది. సత్యమ్మ గుడి నుంచి తప్పెట్లు వాయిస్తూ ఆనందోత్సాహాల నడుమ పోతు రాజును ఊరేగింపుగా మారమ్మ గుడి వద్దకు తీసుకెళ్లి గ్రామ దేవతకు పూజలు నిర్వహించారు. తిరిగి అక్కడి నుంచి చిట్వేలి ప్రధాన రహదారిలో ఊరేగింపుగా పోతురాజును సత్యమ్మ గుడి వద్దకు తీసుకెళ్లారు. సత్యమ్మ జాతరను మూడు రోజులు నిర్వహించనున్నట్లు జాతర నిర్వాహకులు తెలిపారు.