చిట్వేలు: "మంచి ఉత్తీర్ణత సాధించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి"

60చూసినవారు
చిట్వేలు: "మంచి ఉత్తీర్ణత సాధించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి"
విద్యార్థులు బాగా చదువుకుని మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని జిల్లా ఎస్సీ సంక్షేమ సాధికారత అధికారి జయప్రకాష్ ఆకాంక్షించారు. చిట్వేలులోని సమీకృత బాలుర వసతి గృహంలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు బుధవారం ప్రేరణ తరగతులు నిర్వహించారు. జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రసాద్ మాట్లాడుతూ చదువుతోపాటు మంచి క్రమశిక్షణ అలవాటు చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్