చిట్వేలు - కోడూరు ప్రధాన రహదారిలో ఆటో బోల్తా పడి నేతివారి పల్లెకు చెందిన ఇద్దరు యువకులు గాయపడిన ఘటన శుక్రవారం ఉదయం జరిగింది అని స్థానికులు తెలిపారు. వారి వివరాలు మేరకు. కుమ్మరపల్లికి వెళ్లే దారిలో ఉన్న గ్రామాలలో పాలు సేకరించి పాల కేంద్రానికి సరఫరా చేసే ఆటో బోల్తా పడిందని తెలిపారు. కుక్క అడ్డు రావడంతో తప్పించబోయి అదుపుతప్పి ఆటో బోల్తా పడిందని బాధితులు తెలిపారు.