రాజంపేట నుండి ఓబులవారిపల్లి - వెంకటాచలం - విజయవాడ మీదుగా విశాఖపట్నం కు ప్యాసింజర్ రైళ్ల తో పాటు వందే భారత్ రైలు ను రైల్వే శాఖ వెంటనే ప్రారంభించాలని రాష్ట్ర రైతు సంఘం నాయకుడు మలిశెట్టి జతిన్ కోరారు. శనివారం వెంకటరాజు పల్లెలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నేతివారి పల్లెలో రైల్వే స్టేషన్ నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించి ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పడాలని ఆయన కోరారు.