కొంతమంది విద్యార్థులకు మార్కులు తక్కువ రావచ్చు, దురదృష్టవశాత్తు ఫెయిల్ కావచ్చు ఫెయిల్ అయినా పరీక్షలు రాయటానికి మరో అవకాశం ఉంటుంది అందువల్ల విద్యార్థులు ఎటువంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దని చిట్వేలు ఎంఈఓ కోదండ నాయుడు కోరారు. శనివారం చిట్వేలులో ఆయన మాట్లాడుతూ చదువు మంచి భవిష్యత్తు ఇస్తుందని అందరూ చదువులో ప్రతిభ కనబరచలేరు కానీ జీవితంలో గొప్పగా బతికేందుకు అనేక మార్గాలు ఉన్నాయని అన్నారు.