శుక్రవారం ప్రమాదవశాత్తు నీటి కుంటలో మునిగి మరణించిన చిట్వేలు మండలం మైలపల్లి రాచపల్లి కి చెందిన ముగ్గురు చిన్నారులకు శనివారం రాష్ట్ర ఖాదీ, గ్రామీణ పరిశ్రమల బోర్డు చైర్మన్ కేకే చౌదరి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతిని, సంతాపాన్ని తెలియజేశారు. సెలవు రోజుల్లో చిన్న పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని ఆయన సూచించారు.