చిట్వేలు: అంబేద్కర్ కు నివాళులర్పించిన కెవిపిఎస్, ఎంఆర్‌పిఎస్

55చూసినవారు
చిట్వేలు: అంబేద్కర్ కు నివాళులర్పించిన కెవిపిఎస్, ఎంఆర్‌పిఎస్
చిట్వేలు లోని సర్కిల్ వద్ద ఉన్న డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి సోమవారం సిపిఎం రైతు సంఘం అధ్యక్షులు పందికాళ్ళ మణి, కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి అధ్యక్షులు పెంచలయ్య, ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మంద నాగేశ్వరావు, మాలేమార్పురం సర్పంచ్ ఈశ్వరయ్య, సిపిఐ నాయకులు తిప్పన ప్రసాద్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మనిషి జీవితాన్ని, జీవనవిధానాన్ని మార్చగలిగేది చదువు ఒక్కటే అని సమాజానికి డా: అంబేద్కర్ సూచించిన మార్గం ఎప్పటికీ ఆదర్శనీయమన్నారు.

సంబంధిత పోస్ట్