చిట్వేలు నుండి రాపూరుకు వెళ్లే ఘాట్ రోడ్డులో ఇటీవల ఫెంగల్ తుఫాను కారణంగా కురిసిన వర్షాలకు చెట్లు రోడ్డుకు అడ్డంగా పడ్డాయి. రహదారులు భవనాల శాఖ అధికారులకు విషయం తెలిసినా పట్టించుకోలేదు. రోడ్డు మలుపులో చెట్లు కూలడంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనపడక వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. బుధవారం రాజంపేట మండల టిడిపి అధ్యక్షుడు గన్నే సుబ్బ నరసయ్య నాయుడు తన సొంత ఖర్చులతో జెసిబి సహాయంతో చెట్లను తొలగించారు.