చిట్వేలు మండలం తిమ్మాయ పాలెం గట్టుమీద పల్లిలో సిమెంటు రోడ్డు నిర్మాణానికి బుధవారం ప్రభుత్వ విప్, రైల్వే కోడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ ప్రజల ఇళ్ల పట్టాల సమస్యలను, నీటి సమస్యను, విద్యుత్ సమస్యను, రోడ్లు ఇతర భూ సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీడీపీ యువ నాయకుడు ముక్కా సాయి వికాస్ రెడ్డి, గుత్తి నరసింహ పాల్గొన్నారు.