చిట్వేలు: వక్ఫ్ చట్ట సవరణ బిల్లును వెంటనే రద్దు చేయాలి

72చూసినవారు
చిట్వేలు: వక్ఫ్ చట్ట సవరణ బిల్లును వెంటనే రద్దు చేయాలి
బీజేపీ అధికారంలోకి వచ్చి తన రాజకీయ ప్రయోజనాల కోసం మతాల మధ్య చిచ్చు పెడుతూ రాజకీయ లబ్ధి పొందుతోందని సీపీఐ రైల్వేకోడూరు నియోజకవర్గ కార్యదర్శి జ్యోతి చిన్నయ్య అన్నారు. శనివారం సీపీఐ ఆధ్వర్యంలో చిట్వేలు మండల తహసీల్దార్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జ్యోతి చిన్నయ్య, తిప్పన ప్రసాద్ మాట్లాడుతూ, వక్ఫ్ బోర్డు చట్టాన్ని సవరణ చేసి, ఆస్తులను ప్రైవేటు కంపెనీలకు అప్పగించడానికి కుట్ర చేశారని అన్నారు.

సంబంధిత పోస్ట్