చిట్వేలు మండలం తుమ్మచెట్ల పల్లికి చెందిన చరణ్ (35) పొలానికి దగ్గరలోని వంకలో దాచిన 278 కిలోల బరువు గల రూ. 400000 విలువైన 12 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నట్లు రాజంపేట ఏఎస్పి మనోజ్ రామనాథ్ హెగ్డే తెలిపారు. బుధవారం చిట్వేలులో ఆయన మాట్లాడుతూ చరణ్ తో పాటు నాగేంద్ర (48), వెంకటరమణ (35) ను అరెస్ట్ చేసి, ట్రాక్టర్, మూడు ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కార్యక్రమంలో సీఐ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.