మహిళలకు అన్నిరంగాలలో సమాన హక్కులతో పాటు ఉచిత న్యాయ సహాయము పొందే అవకాశము భారత రాజ్యాంగం కల్పించిందని రాజంపేట స్పెషల్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ డాక్టర్ పసుపులేటి శంకర్ అన్నారు. చిట్వేలు మండల అభివృద్ధి అధికారి కార్యాలయంలో శనివారం జరిగిన మహిళా న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన మాట్లాడుతూ మహిళలకి చట్టపరంగా ఉన్న హక్కులు, కుటుంబ విలువల గురించి వివరించారు.